Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

ఎలా తెలుపను ?

ఎలా తెలుపను ?

1 min
392


నీపై కలిగే ప్రేమను నేనెలా తెలుపను ?

ప్రియా ! ప్రేమ ఎలా కలుగును , నేనెలా తెలుపను ?

కలలో నువు పగలు రాత్రి కనిపిస్తే ప్రేమా ?

తియ్యని కబురులు చెబితే ప్రేమా ?

కళ్ళు మూసుకుని చెప్పే కథలే వింటే ప్రేమా ?

ఏమో ! నాకైనా ప్రేమంటే ఏమి తెలుసు ?

నీవెంటే తిరుగుతు ఉంటా . మాటాడుతు ఉంటా .

నీవు చెప్పే ఊసులకు తలాడిస్తూ ఉంటా .

నీపై కలిగే ప్రేమను నేనెలా తెలుపను ?

ప్రియా ! ప్రేమ ఎలా కలుగును , నేనెలా తెలుపను ?

పువ్విస్తే ప్రేమా ? నవ్విస్తే ప్రేమా ?

నవ్వుతూ పువ్విస్తేనా ? పువ్విస్తూ నవ్వితేనా ?

పూవ్వులా నువ్వుండాలని నే కోరితే ప్రేమా ?

మనసంతా నింపుకుని నీకోసమే బ్రతికితే ప్రేమా ?

ఏమో ! ఏమో ! ఏమో !

నువు నా ప్రక్కనుంటే ప్రేమ .

నీ మనసంతా నేనుంటే ప్రేమ . పువ్వులా నవ్వితే ప్రేమ .

చల్లగా చూసుకుంటే ప్రేమ . అదే నే కోరుకునే ప్రేమ .

అంతేనా ప్రియా ! అదేనా అసలు ప్రేమ !?

మనలో ఒకరిపై ఒకరికి కలిగే ప్రేమ ! అదేనా ప్రేమ !

అదే ! అదే ! అదే !

మనలో మనమెప్పుడూ కోరుకునే ప్రేమ .

ఎప్పటికీ మనమధ్యనే పచ్చగా ఉండే ప్రేమ .




Rate this content
Log in

Similar telugu poem from Romance