STORYMIRROR

Patlori pravalika

Inspirational Children

4  

Patlori pravalika

Inspirational Children

ఎలా చెప్పను...

ఎలా చెప్పను...

1 min
1.5K

నా గుండె చప్పుడు ని పేరే పలుకుతుందనీ...

నా శ్వాస నీ శ్వాసలో చేరి పోవాలని ఆశ పడుతుందని...

నా మనసు నాలో సగభాగం నీవు కావాలని ఆరాటపడుతుంది......

నా మది నిన్నే చేరుకోవాలని కోరుకుంటుంది..

నా జీవితం నితో పంచుకోవాలని అనిపిస్తుందని నీతో చేపుకొలేకపోతునను..

కానీ.....!

నీతో ఉన్న క్షణం నాకు కలిగే ఆనందం..

నీ తలపుల కు నాలో పెరిగే అలజడి...

నీ ప్రేమను పొందాలని నాలో జరిగే నిరంతరం సంఘర్షణ..

నీతో కడవరకు జీవించాలని చిగురించే ఆశలు...

ఇవ్వని చూస్తూ నీకు చెప్పకుండా ఉండలేక పోతున్నాను...

అందుకే ఊహల్లో ఊరిస్తూ ...కలలో కవ్విస్తూ ...

వలపుల వయ్యారం వలబొస్తు ...మాటలతో మాయ చేసే నీకు.....

నా మనసును కాగితం చేసి దానిపై అక్ష రాళ్లతో నీ రూపం నిర్మించి నిన్ను వర్ణించేందుకు కలమును రాయబారిగా చేసి... నా మనసులో దాగి ఉన్న ప్రేమను నీకు తెలియజేయాలిఅనుకుంటున్నా...కానీ ధైర్యం సరిపోవడం లేదు రా....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational