ఏం చేస్తారు?
ఏం చేస్తారు?


ప౹౹
నేనే నాయకుడినైతే నేనే నాయకుడినైతే
ఇక ఏ పొరపాటు లేదోయి కుడి ఎడమైతే ౹2౹
చ౹౹
మాటలనే కోటలనే దాటించేస్తాగ తేలికగ
మాతృ భాషను మానిపించేస్తాగా ఏలికగ ౹2౹
అమ్మ భాషను అవమానిస్తాగ ఏంచేస్తారు
కమ్మని పలుకే కనపడనీయనుగా చస్తారు ౹ప౹
చ౹౹
ప్రశ్నించావంటే పనికట్టుకొని నీపనిపడతా
కట్టించావంటే ఆ భవంతులనే పడగొడతా ౹2౹
కులమతాల కుమ్మలాటలు చాలా పెడతా
తిలాపాపమే తలా కాస్తా పంచి చూపెడతా ౹ప౹
చ౹౹
అయిన వారిని అదిలించి ఆకులే వేస్తాను
కాని వారికి కంచాలలోనే పెట్టి అందిస్తాను ౹2౹
నాయకుడంటే నేనే అని ఊదరగొట్టిస్తాను
నయా వినాయకుడునని బెదరగొట్టిస్తాను
ఏంచేస్తారు ఏంచేస్తారు అహా ఏం..చేస్తారు ౹ప౹