ఏమయిందో...
ఏమయిందో...


ప౹౹
ఏమయిందో తెలియదు నాకు వివరం అడగకు
ఏముందో మదిలో కొత్తగా ఆ ఆశలనే తొడగకు ౹2౹
చ౹౹
వీచిన గాలి విరుజల్లే కురిసి విరహాగ్నులే పెంచే
విచ్చిన పూలే వీరావేశంతో బడబాగ్నులే పంచే ౹2౹
గుచ్చిన చూపులే గురి తప్పలేదూ గుంభనంగా
నచ్చిన నయనాలే నర్తనము చేసే సంరంభంగా ౹ప౹
చ౹౹
వేడుకా వెనుదిరుగకే ఏమరచి సోయుగాలును
పాడుకో పరిమళాల వలపు అన్ని యుగాలును ౹2౹
హత్తుకో మత్తునే మరులతో మరల పూయించి
పోత్తులో కొత్తగానే కోరికలతో అమరులై దీవించి ౹ప౹
చ౹౹
మళ్ళిపూసిన మల్లెలతో మరలివచ్చే పున్నమిక
వెళ్ళిచూసి వేగిరం వాడుకగ తీర్చుకో దాహమిక ౹2౹
ఎదలో సాగనీ ఎలమి ఏరువాకలే ఎడతెరిపిలేక
తుదలేని తుమ్మెదఆరాటం తుళ్ళించనీ వదలక ౹ప౹