ఏమిటిలా
ఏమిటిలా
కలలవీణ రాగాలను..త్రాగేస్తూ ఏమిటిలా..!?
నన్ను నేను నిలదీయక..బ్రతికేస్తూ ఏమిటిలా..!?
ప్రేమనదిగ ప్రవహించే..తత్వమెలా వంటబట్టు..
ఆనందపు నిధిపట్టక..మిడికేస్తూ ఏమిటిలా..!?
యుద్ధమెవరితో చేతువు..అజ్ఞానము పైనగాక..
తృప్తియొక్క విలాసమది..వెతికేస్తూ ఏమిటిలా..!?
దైవత్వపు కాంతిసుధను..అనుభవించు భాగ్యమేది..
చెలిమివిలువ తెలిసికూడ..పాతేస్తూ ఏమిటిలా..!?
తనఓటుకు సార్థకతను..కల్పించిన వారెవ్వరు..
ప్రశ్నించే నిబద్ధతను..పేల్చేస్తూ ఏమిటిలా..!?
ఎంతగొప్ప నాటకమిది..సాక్షిగాను నిలచుటెపుడు..
గురువాక్యపు రాదారిని..వదిలేస్తూ ఏమిటిలా..!?
