ఏమి తెలుసు?
ఏమి తెలుసు?

1 min

15
ఏమి తెలుసు
ఎక్కడ తెలుసు
సుస్వరాలన్ని
సారా తాగినట్టు
అష్ట దిక్కులన్నీ
అంగి వేసినట్టు
పంచ భూతాల న్నీ
పంచె కట్టినట్టు
సప్త సముద్రాల న్నీ
సంచీ లో ఉన్నట్టు
అన్ని తనకే తెలుసని
పోజు కొట్టడం తప్ప!
రొమ్ము పాలు తాగి
అమ్మ ను తన్నినట్టు
అమ్మ భాష నేర్చి
పర భాష గొప్పదని
పోజులిచ్చే
జులాయి కి
ఏమి తెలుసు
అమ్మ భాష
గొప్పదనం!
అన్నీ నాకే తెలుసని
పోజుకొట్టడం తప్ప!