ఎడబాటు
ఎడబాటు
నీకు నాకు దూర మంటె నిస్తేజ మవుతున్న
నాకు తోచ కేమి నలుగు తున్న
వేరు గుంట మంటె నేరుగా కష్టమే
కాల మెంత కఠిన కర్క శంబు
చొచ్చు కొచ్చి మనసు మచ్చిక అయినావు
మనసు నంత కమ్మి మైక మొచ్చె
వాస్త వంబు చేదు వైనాన్ని యెరిగినా
పిడికె డంత గుండె పేల వంబె..!
మనసు సాక్ష్య మైతె మామేక మైనాము
భౌతి కముగ లోటు భార మేను
ప్రాణసఖి కెడముగ ప్రాణాలు కడగట్టు
మరుగు నున్న వెలితి యెరుగ నైతి
పరిచయ మైనాక ప్రాణాని వైనావు
సఖి నువు లేకుంటె సుఖము లేదు
దూరమై పోయాక దారుణంగా నుండె
గడిచె ప్రతి దినము గండ మాయె
వేరు గుండడ మంటె వెతలతో బతకేను
అనుదిన నరకంబు అతివ నమ్ము
కాల నియతి మీర జాలగా మనమెంత
నమ్మిక నడిపించు ఒమ్ము గాక.....!!
నీవు వున్న మనసు నిలువెత్తు దర్పణం
వెక్కి రించె నన్ను వెతను జూసి
విరహ వేద నంటె మరణ సదృశ్యమే
ప్రేయసి కెడబాటు పెద్ద చింత..!
ఎడద లోతు లోన బెడద హెచ్చింపాయె
మరులు గొన్న మనసు మసక బారె
పలక రింపు లేక పులకరం కరువాయె
నిత్య కర్మ లందు నిష్ఠ పాయె
---సిరి❤️✍️❤️

