ఎడబాటు
ఎడబాటు
ఎడబాట్ల సంకెలలు తెంపుకొని వచ్చాను
ప్రణయాల హారాలు వేసుకొని వచ్చాను
మనసు పడినావనే తెలుసుకొని వచ్చాను
నా(నీ) కొరకు వరమాల పట్టుకొని వచ్చాను
నల్లమబ్బుని మించు కొప్పులో తురమాలి
తారకల గుత్తులను తుంచుకొని వచ్చాను
మత్తులో పడవేయు మాటకారిని కాదు
మదిలోని భావాలు రాసుకొని వచ్చాను
అధరాల సాయాన్ని కోరుకుంటున్నాను
పెదవితో దాహాలు మోసుకొని వచ్చాను
పొదరింటిలో పాన్పు పరచుకోవాలిగా
మా తోట మల్లెలను కోసుకొని వచ్చాను
చొరబడే గాలితో మంచిగా మసలాలి
ముందుగా ప్రార్థనలు చేసుకొని వచ్చాను
పరుగు తీసే చివరి జాములకు 'నెలరాజ'
మెల్లగా నడవడం నేర్పుకొని వచ్చాన

