STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

దండాలయ్యా 🙏

దండాలయ్యా 🙏

1 min
270

మొక్కకి నీరు పోస్తే చాలు..నిలుస్తుంది

పశువుకి పరక వేస్తే చాలు..పెరుగుతుంది

మరి పశువు కాదు కదా మనిషి

మనిషిని వేరు చేసి చూపేది...మనసు

ఆ మనో వికాసానికి శిక్షకుడే..గురువు


పువ్వు విరబూస్తే..ఎంతో అందం

మనిషి వికసిస్తే..ఎంతో గౌరవం

ఆ గౌరవాన్ని తెచ్చేదే...గురువు


చలనం లేని రాయినైనా శిల్పంగా మలిచేందుకు 

ఎంతో కష్టపడతాడు..శిల్పి

ఎదురు చెప్పని వెదురునైనా మురళి గ

మార్చేందుకు..ఎంతో శ్రమిస్తాడు వండ్రంగి

మాట మాత్రం మాట్లాడని 

బంగారాన్ని సైతం మెరిసేలా చేసేందుకు 

ఎంతో ఓపిక పడతాడు..కంసాలి!


మరి 

చలనమున్న..చిత్తమున్న

తనకంటూ ఒక ఇష్టమున్న 

ఒక వ్యక్తికి విద్యనందించటం

ఎంత అసాధ్యమో..కదా

అలాంటిది ఒక్కరికీ కాదు ఇద్దరికీ కాదు

యెన్నో వేల మందికి జ్ఞానాన్ని ఇవ్వగలిగే

ఒకే ఒక కల్ప తరువు...మన గురువు


గురువు 

నేడు మనకు వేసే దరువు

రేపు నిలుపుతుంది మన పరువు

నేడు మనపై వేసే బరువు

రేపు తీరుస్తుంది మన కరువు


ఈ సృష్టిలో విత్తు లేని చెట్టు లేదు

బోధకుడు లేని..సాధకుడు లేడు 

అందుకే

ప్రపంచానికి వెలుగు..ఆ సూర్య

మానవుని బుద్ది వికాసానికి..మన ఆచార్య

ఓ ఆర్యా..

అందుకో మా ప్రణామాలయ్యా🙏🙏🙏🙏


          ......రాజ్.....


Rate this content
Log in

Similar telugu poem from Classics