దివ్య తేజం
దివ్య తేజం
దివ్య తేజం.
- (వచన కవిత)
**************************
ఘృతాచి రూపమతిలోక సౌందర్యానికి నిర్వచనం.
అతులితమైన సోయగముతో నలరారు దివ్య తేజం.
సప్త ఋషులను సైతం సమ్మోహన పరచే చైతన్యం.
దీప్తివంతమౌ శోభతో దిశల నేలగల సామర్ధ్యం.
పురాణ పురుషు లెందరో కోరిరామె సాంగత్యం.
సురోత్తములచే సన్నుతి చేయ బడినదా రాజసం.
దైవ కార్యార్థం బహుళ సంతానవతిగా జీవించటం.
జీవన గమనంలో పలు ధర్మ కార్యాలు నిర్వర్తించటం.
భూసుర, ముని, రాజేంద్రులతో చేసిన సంసార జీవనం.
ఆ సంసార సాగరంలో యుగాలపర్యంతం చరించటం.
శుక, నల, ద్రోణ, రురులకు మాతృమూర్తిగా పెద్దరికం.
అకళంకితగా చరితలో శాశ్వతంగా నిలిచి పోవటం.
ఆమె పేరుతో పలువురు జీవించి యుంటారని అనుమానం.
ఏమో!పురాణాలు తిరగేసినా లభించలేదులే సమాధానం.
మానినీ మణుల జన్మరహస్యాలు విచిత్రంగా గోచరించటం.
ఆనాటి ఇతిహాసాలలోని పాత్రల రూపకల్పనలమోఘం.//
***********************
