దివము
దివము


పద్యం:
మానవత్వపు మది మంచిచేయుచునుండు
దానవత్వపుమది దైన్యముగను
దైవ గణముల మది దివము యదార్ధము
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! మానవత్వం ఉన్న మనసులు మంచిని చేస్తుంటారు. కానీ దానవుల గుణం ఉన్నవారు కనీస మానవత్వం లేక దైన్యంగా ఉంటారు. దైవ గుణం ఉన్న మనుషుల మది స్వర్గం వంటిది. ఇది నిజము.