దిశానిర్దేశం
దిశానిర్దేశం
*దిశానిర్దేశం*
(కవిత )
ఎన్నికల వేళ నేతల వాగ్దానాల హోరు
కన్నుమిన్ను గానని మ్యానిఫెస్టోలజోరు
అనుచితంగా ఇచ్చే నుచిత పథకాలు
పనికిమాలినట్టివీ పలాయన సూత్రాలు
పెరుగుతున్న బద్ధక భారతదేశపు జనం
తరుగుతున్నది ప్రజల్లో వృత్తినైపుణ్యం
కష్టపడకుండా కలిసొచ్చినట్టి సౌకర్యం
నష్టాల యూబిలో జారును సామ్రాజ్యం
దివాలా తీయుచున్నది దేశార్థిక ఖజనా
నవతరంలో నిల్చోవటానికేది బిచాణా?
మేలుకోకపోతే ఇక భవిష్యత్తు శూన్యం!
కాలగతిలో బిచ్చమెత్తుకోవటం తధ్యం!
ఆలోచించండి!మేధావుల్లారా!కదలండి!
కాలయాపన చేయకండి జనులారా!పదండి!
జాతి ప్రగతికై పురోగమిస్తూ నినదించండి!
నేతలు మీరై దిశానిర్దేశం చేస్తూ నడవండి!//
