ధర్మసూక్తి
ధర్మసూక్తి
*ధర్మ సూక్తి*
(బాలపంచపదులు )
పాతాళానికి చేర్చే యహంకారము
వైరమును పెంచే అహంకారము
ఒంటరిని చేసే అహంకారము
ఓటమిని తెచ్చి పెట్టే అహంకారము
తెలిసికొనుము నిజము విజయా!
మానవతనే పెంచు మమకారము
మంచితనము పెంచు ప్రతి క్షణము
చెలిమిని నిల్పెడి సాధనము
బలము నొసంగెడి యమృతము
తెలిసికొనుము నిజము విజయా!
ప్రకృతితో మమేక మీ జీవితము
ప్రతిజీవిలో నుండు నొకే ప్రాణము
పరహింస మానుటే సదాచారము
కఱకు దనము వీడుటే హితము
తెలిసి కొనుమ నిజము విజయా!
--------------------------------
