ధర్మసూక్తి
ధర్మసూక్తి
ప్రజల మేలును కోరెడి పాలకుండు
విజయ వంతుడై వెలుగునీ విపుల యందు
బలము చూపక జనులకు బాంధవునిగ
నిలచి యుండగా లోకులు కొలుచు కొంద్రు.
నిజము పల్కెని వానికి నిశ్చయముగ
ప్రజలు మాన్యత నిడుచుంద్రు భక్తితోడ
వినయ శీలుడు శాస్త్రంపు విద్యనేర్చి
ఘనత సాధింప లోకులు గౌరవింత్రు.
మోయలేమంచు భారమున్ మ్రొక్కుకొనుచు
సాయం మందీయ రమ్మంచు సజ్జనతతి
వినతులన్ సల్ప వేగమే బెంగ తీర్చి
ఘనత వహియించు విష్ణుండు కరుణ చూపు.//
