STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

దారానికేమి తెలుసు

దారానికేమి తెలుసు

1 min
321

ఆ దారానికేమి తెలుసునులే మల్లెపూల వాసనలు

ఆధరానికేమి తెలుయును ఆ వలపుల వ్యసనాలు

పద పదమని తరిమే తృష్ణలో పల్లవించునే సూక్షం

కథ ముగిసాకా కలిగే తేనెల ఝరులకే కదా మోక్షం

ఎవరేమన్నా ఎదలు రెండూ కలిపేయుట సాధ్యమే

అవునన్నా కాదన్నా అమర ప్రేమలో అది తధ్యమే

ఆ దారానికేమి తెలుసునులే మల్లెపూల వాసనలు

ఆధరానికేమి తెలుయును ఆ వలపుల వ్యసనాలు


కౌగలింతలే ఎన్నో వింతలే చేరూ ఎద ఉదయంలో

గిలిగింతలే గిచ్చి గిచ్చి పెట్టును ప్రతి హృదయంలో

మనిషన్నాకా మరులన్నాకాను కురవవా మరవకా

మనసన్నాక మరలదే మరొకరిపై ఏమీను ఎరవకా

ఆ దారానికేమి తెలుసునులే మల్లెపూల వాసనలు

ఆధరానికేమి తెలుయును ఆ వలపుల వ్యసనాలు

పద పదమని తరిమే తృష్ణలో పల్లవించునే సూక్షం

కథ ముగిసాకా కలిగే తేనెల ఝరులకే కదా మోక్షం


అరవిరిసే మందారానికి ఆరబోసిన అందాలు ఎన్నో

తరిమేసే తనువుకి తహతహలు కలిపేసేసి ఇంకెన్నో

అరవిరిసే మందారానికి ఆరబోసిన అందాలు ఎన్నో

తరిమేసే తనువుకి తహతహలు కలిపేసేసి ఇంకెన్నో

ఎవరేమన్నా ఎదలు రెండూ. కలిపేయుట సాధ్యమే

అవునన్నా కాదన్నా అమర ప్రేమలో అది తధ్యమే

ఆ దారానికేమి తెలుసునులే మల్లెపూల వాసనలు

ఆధరానికేమి తెలుయును ఆ వలపుల వ్యసనాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance