దాంపత్యవనం
దాంపత్యవనం
ప్రేమతరువులైనట్టి దంపతులు
కామార్థ ధర్మ సాధనాయుతులు
నీమ నిష్ఠలతో చరించు యోగులు
సామరస్య జీవన సాధ్యాయనులు
దాంపత్య వన సౌరభాలు విజయ!
జీవనంబున కలిసి ప్రయాణము
పావనంబగు సంసార బంధము
తావి నిండిన పూల మకరందము
నీవే నేనను భావ మాధుర్యము
దాంపత్య వన సౌరభము విజయ!
సరస సల్లాప ప్రియ సంయోగము
బరువు బాధ్యతలతో మమేకము
మరుపు లేని మమతాను రాగము
నిరతము చిల్కు సుధామృతము
దాంపత్య వన సౌరభము విజయ.
అండగ నిలుచునీ యభిమానాలు
దండిగా మొలకెత్తు బీజాంకురాలు
నిండుగా వందేళ్లు నిత్య శోభనాలు
పండిన యనుభవ సారములు
క్రొత్త తరానికి పాఠాలు విజయ.
