చెలియా ❤️❤️
చెలియా ❤️❤️
ప్రేమలేఖ అని ఏదో..వ్రాయలేను చెలియా..!
ప్రేమించా అనుమాటే..పలుకలేను చెలియా..!
మనసు మూగపోయె కదా..నినుచూసిన నాడే..
నీ చూపుల ఆ వేదం..చదువలేను చెలియా..!
మధువెక్కడ దొరుకుతుంది..విరహతాప మణచ..
ఊరించే వలపుఘోష..పాడలేను చెలియా..!
కనుపాపల దీపాలకు..నీ తలపే ఊపిరి..
ఎదురుచూపు కోవెలలో..ఉండలేను చెలియా..!
ఎవ్వరేమి అనుకున్నా..సత్యమేల మారును..
గుండెచాటు గగనాలను..చూపలేను చెలియా..!
ఏడడుగుల బాంధవ్యం..అపురూపం నిజమే..
అది ఏదో రుణమంటే..ఓర్వలేను చెలియా..!
గుట్టు..పట్టుకున్న శాంతము..
అక్షరాల స్వర్గమేదో..తెలుపలేను చెలియా..!

