చెలియా...
చెలియా...
ప్రేమగాక వేదమేది..పాడలేను చెలియా..!
చెలిమిగాక మధువేదీ..అడుగలేను చెలియా..!
హృదయమునే ఇవ్వకనే..దోచుకొంటివి ఎలాగ..
కనుపాపల నీ రూపము..తుడుపలేను చెలియా..!
మనసులోని భావాలకు..అక్షరాలు చాలవు..
విరహవీణ బహుమతియా..వీడలేను చెలియా..!
జాణతనమే మధువుగా..నింపినావులె మదిని..
నీ తలపే శుభచైత్రము..మరువలేను చెలియా..!
దాశరథినొ గాలిబునో..కాను గజలై పొంగ..
ప్రేమలేఖా అదేమో..వ్రాయలేను చెలియా..!
కానరాని నీ కోసం..చూచు కనులు మలగవు..
ఇంతకన్న ఎక్కువగా..చెప్పలేను చెలియా..!

