STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలిమి

చెలిమి

1 min
349

ఇష్టము పెంచుకు..బ్రతికిన సౌఖ్యము..!

ఏకాంతములో..చేరిన శాంతము..!


చెలికై వెతికే..వేళన అలుపే..

ఎదురుచూపులో..కరిగిన భాగ్యము..!


వెన్నెల నదిలో..ముద్దులు బరువే..

ఒంటరి తనమును..వలచిన ధన్యము..!


వీడని తలపుల..గగనం ఎందుకు.. 

భాషా సొగసులు..పండిన కవనము..!


మనసుకు తనువుకు..వంతెన ప్రాణం..

దీపము ఎఱుకన..నిలచిన మోక్షము..!


ఎవరిని ఎవ్వరు..మేల్కొల్పేరట..

కాలము ఖర్మము..చెల్లిన స్వర్గము..! 


చెలిమిని పంచుట..తెలిసిన చాలును.. 

మనసు.వెలిగిన నిత్యము..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance