STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

చెలికాడు.

చెలికాడు.

1 min
286


కలిమియందు లేమి యందు 

కష్టకాల మందు కరము చాచి

మనకు తోడుగా మసలు చుండు

మన ప్రాణము మన చెలికాడు.


ఉన్నత స్థితిలో వున్న

వెన్ను తట్టి మెచ్చుకొనుచు

ఉత్సాహము నింపే

మన ప్రాణము మన చెలికాడు.


దుర్దశలో మునిగి పోవ

చెయ్యి పట్టి లేవదీసి

సరసకొచ్చి సాయపడే 

మన ప్రాణము మన చెలికాడు.


సమస్యలో కూరుకొని

మంచేదో చెడు ఏదో

మఱచి పోయి తిరుగుతుంటే

సమయస్ఫూర్తిగ మంచి

 సలహా నిచ్చే

మన ప్రాణము మన చెలికాడు.


భావ మొకటే, హృదయమొకటే, పయన మొకటే,గమ్యమొకటే మన వెంటే 

తోడు నీడగా వుండే

మన ప్రాణము మన చెలికాడు.




Rate this content
Log in

Similar telugu poem from Classics