చెలి చూపులో
చెలి చూపులో
జామురాత్రి జాజులతో..జగడమేల అసలు..!?
చెలిచూపుల తేనెగాక..అన్నమేల అసలు..!?
ప్రతి సంధ్యా సింధూరం..అద్భుతమౌ మధువె..
పసిడిపూల వనములోన..విరహమేల అసలు..!?
తలరాతో చేతిరాతొ..మార్చుకునే దెవరు..
అందమైన నాటకాన..బంధమేల అసలు..!?
కలలైనా కోర్కెలైన..అంతమెప్పు డవును..
జరుగుతున్న జాతరింటి..గంధమేల అసలు..!?
కాలమంటు లేదంటే..తెలిసేది ఎలాగ..
ప్రేమమయం జగం కదా..వర్జ్యమేల అసలు..!

