STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

చేయికలుపు మిత్రమా!

చేయికలుపు మిత్రమా!

1 min
350


------------------------

ఝాన్సీ రాణి దూసు

కెళ్లె

విప్లవమే గమ్యమనుచు

భగత్ సింగు చాటి చెప్పె విప్లవమే బాట యనుచు

తెల్ల దొరల ఉసురు తీసె

అల్లూరి ఘోషించెను

విప్లవమే ఊపిరని

భారతీయ రక్తములో

రాజుకున్న విప్లవమే

సీమ దొరల రాజ్యాలను

చీల్చి వేసె మూలాలతో

అన్యాయము నెదిరించే

ఆత్మబలము మన సొంతము

వెఱపు లేని వీర భూమి

ఎలుగెత్తి చాటునులే

దేశ ప్రగతి కోసము నా ప్రజ

ప్రాణాలను ఇస్తారని.

కాలమెంత మారినా

పాలనలో పాపాలను

కడిగి వేసి అడుగు వేసె

క్రాంతి మణులు మనకుంటే

భయమెందుకు? దిగులెందుకు?

నువ్వూ నేను కలిస్తే

నిప్పులనే చెరిగేస్తాము.

చేయి కలుపు మిత్రమా!

చెడుపైన యుద్దానికి సై అంటూ దూకేద్దాము.

చరిత్రలో యోధులుగా 

నిలిచిపోయి నింగి లోన

చుక్కల్లా మిగిలి పోయి

పాత తరపు వీరులతో

పందాలను వేసుకుంటూ

అజరామరమై అవనికే వెలుగవుదాము.

------------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics