చదువు
చదువు
ఎన్ని పనులు చేస్తున్నా..చదువులెన్నొ నేర్వవచ్చు!
బద్దకాన్ని జరిపేస్తే..జయములెన్నొ పొందవచ్చు..!
డోలాయమానంలో..పడి ఉండటమే జాఢ్యమోయి..
నాటకాన్ని గమనిస్తే..సుఖములెన్నొ అందవచ్చు..!
బాలలైన వారి శక్తి..యుక్తులన్ని అమోఘమే..
వెట్టిచాకిరేమి లేదు..సులువులెన్నొ తెలియవచ్చు..!
ఎవరు ఎలా తలపోస్తే..అదే సత్యమై తీరును..
అనుభవాలు గమనిస్తే..కోర్కెలెన్నొ కాల్చవచ్చు..!
ఓ మాటకు కట్టుబడే..తత్వనిధియె మౌనమోయి..
చెలిమి మూలమందితేనె..గుండెలెన్నొ కదపవచ్చు
