సమయమాయె
సమయమాయె
చూడ చూడ గతం వచ్చి ..కరగి పోవు సమయమాయె...!
కర్మచక్ర బంధమింక .. తొలగి పోవు సమయమాయె...!
ఆజ్ఞ ఇచ్చు నేత్రమిపుడు.. విచ్చుకొనగ సిద్ధమోయి..
మైత్రి గగన వీధులలో.. మురిసిపోవు సమయమాయె...!
కనులు రెండు సరిగ మూసి..ఆలకించు మనసు గొడవ...
తనువంతా పరవశాన.. వెలిగిపోవు సమయమాయె...!
ఆరోగ్యమె భాగ్యమనుచు.. పాఠాలను చెప్పనేల..
తపనపడే హృదయాలే కలసిపోవు సమయమాయె...!
ఆనందపు లోకాలను.. తిరగాలను కోరికేమి..?!
ఓ నిమిత్త మాతృత్వము.. సాగిపోవు సమయమాయె...!
