Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.6  

Ramesh Babu Kommineni

Romance

బుట్టబొమ్మ

బుట్టబొమ్మ

1 min
24.2K


ప౹

ఓ బొమ్మా బుట్టబొమ్మా మనసునలా తట్టకమ్మా

కట్టకమ్మా కట్టకమ్మా గాలిలోన కోటలు కట్టకమ్మా ౹2౹


చ౹౹

అందనీ చందమామనూ అందుననీ నమ్మించునే

చెంతనే చేర్చి ఆడుకోవచ్చని ఆశలు పుట్టించునే ౹2౹


రెక్కలగుర్రం రెపరెపలిడుతూ గాలిలోన తిప్పునే

చుక్కల ఆకాశం చక్కని అవకాశం అని చెప్పునే ౹ప౹


చ౹౹

వయసు మర్మమే ఎరుగక వయారమని సర్దుకోకే

వరసతప్పి సొగసుముసుగులో అసలే చిక్కుకోకే ౹2౹


కనిపించేవన్నీ కంటికి కనిపించేవన్నీ పాలనూకోకే

వినిపించేవన్నీ వింతగ వినిపించిన వినాలనుకోకే ౹ప౹


చ౹౹ రంగులా లోకం రింగు రింగునా ఊహల్లో ఊపునే

పొంగులా పాలపొంగులా కలల్లో ముంచిచూపునే ౹2౹


మదిలోని కలలకు మారాకూ వేయనీకే చిలకమ్మా

ఆదిలోనే అసలు కథకు తాళం వేసి కదలనీకమ్మా ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance