Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

బ్రూణహత్యలు.

బ్రూణహత్యలు.

1 min
207



 లింగభేదము చూపెడి లేకితనము

జంతుజాలము లెరుగవు జగతిలోన 

పశువు కన్నను హీనము పాడు జన్మ

కన్న బిడ్డను చంపెడి కాల మౌర!


 చిన్ని పసికూన ప్రాణము చిదిమి వేసి

హీనమైనట్టి కార్యము హేయగతిని

తల్లి తండ్రులు చేయుట ధర్మమౌన?

సంఘ ద్రోహులు వీరిది చావు తెలివి.


 ఆడపిల్లలు లేనట్టి యవని యందు

పురుషుడొకడేమి సాధించు పున్నెములను

బ్రూణహత్యలు చేసిన బూడిదగుచు

జాతి నిలువక భవితయె జారి పోవు.


గర్భమందున్న పిల్లకు గరళమిచ్చి

నుసురు తీసెడి సంస్కృతి నూడ్చి వేసి 

మార్పు తేకున్నమనిషికి మనికి లేక

దగ్ధమైపోవు మన జాతి ధరణి యందు.


 కలిమి నిచ్చెడి లక్ష్మియె కలికి యనుచు

తలచి ప్రేమగ పెంచిన విలువ నిడుచు

జీవితంబును నిలుపును చెలిమి నొసగి

వెలుగు నింపును గృహమున ప్రేమమూర్తి.


 మూగరోదన మాన్పగ ముదిత లంత

కదలి రండిటు వేగమే కదను తొక్కి

ఆడ పిల్లను రక్షింప నలసి పోక

పట్టుదలచూపి సంఘపు బాగు కోరి

నడచి రండమ్మ!నిలుపగ నారి బతుకు.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational