STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

బకాసురవధ.

బకాసురవధ.

1 min
4

బకాసురవధ.
(వచన కవిత )

అతడొక భీకరమౌ రాక్షసజాతి వాడు.
అతికాయుడై ప్రజలను పీడించు వాడు.

బకాసురుడను నామముతో చెలగువాడు.
వికారరూపుడై నిల్చి భీతిని పుట్టించువాడు.

ఖలుడు పర్వత గుహలో నివసించువాడు.
అలవికాని యాకలితో నరచుచుండువాడు.

గ్రామ సీమలను కబళించ కదలి వచ్చినాడు.
గ్రామ ప్రజలతో నొడంబడిక చేసుకున్నవాడు.

దినమునకొక బండి యన్నముతో మానిసిని
పనచిన తింటానని బదులు చెప్పినవాడు.

తిండిబోతు కోర్కెనా ప్రజలు తీర్చుచున్నారు.
బండి యన్నముతో మనిషిని పంపుచున్నారు.

ఏకచక్రపురంబుకు పాండవులు వచ్చినారు.
ఆకాలంబున వారజ్ఞాతంబుగా నట నున్నారు.

బిక్షాటనతో వారట దినములు గడిపెడివారు.
లక్షణమైన రాకుమారులు విధివంచితులైనారు.

రక్కసుని దుర్మార్గత్వము తెలిసి శోచించినారు.
అక్కర తీర్చుటే తమ కర్తవ్యమని భావించినారు.

బండి యన్నముతో భీమునటకు పంపించినారు.
ఎండనబడి భీమసేనుడచ్చోటుకు చేరుకున్నాడు.

ఆకలితో భీముడా యన్నమును భుజంచినాడు.
కేకలు పెట్టుచు కవ్వింపు ధోరణితో తిరిగినాడు.

ధీమంతుడా రక్కసుని సంహరించి గర్జించినాడు.
గ్రామ ప్రజలకు శ్రేయమును కూర్చిన కీర్తిమంతుడు.

ఘనుడౌ భీమునికి జనులెల్ల జయము పల్కినారు.
మనమా గాథను మరల స్మరియించుకుంటున్నాము.//


Rate this content
Log in

Similar telugu poem from Classics