STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

భరత మాత బిడ్డలం //

భరత మాత బిడ్డలం //

1 min
328

భరత మాత బిడ్డలం!

ప్రగతి బాట సాగుతాం!

1.శక్తి కొలది పని చేసే శ్రమైక జీవులం

యుక్తి తోడ జగము గెలుచు నుత్సాహవాదులం 

//భరత మాత //

2. సాధనతో శోధనతో

శాస్త్రవిద్య నేర్చుతాం

మాదే ఈ నవ యుగమని మరల మరల చాటుతాం

//భరత మాత //

3. కలతలను కన్నీళ్లను కడిగి వేసి వెలుగుతాం

కలుషిత భావన తృంచుతు కలిసి మెలిసి మెలుగుతాం

//భరత మాత //

4. తరతరాలమూఢతను తరిమి తరిమి త్రుళ్ళుతాం

దారి తప్పు సోదరులకు

ధర్మమేదో తెలుపుతాం

//భరత మాత //

5. జాతిని జాగృత పరిచే కోటి దివ్య జ్యోతులం

మాతకు వందన మిడుచు భవిత నిలుపు నేతలం

//భరత మాత //


Rate this content
Log in

Similar telugu poem from Children