STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

భృగు మహర్షి

భృగు మహర్షి

1 min
1

భృగు మహర్షి 
(తేటగీతి మాలిక)

బ్రహ్మ మానస పుత్రుడీ పావనుండు.
ఘనుడు భృగుమహర్షిగ తాను ఖ్యాతి నొంది 
పలు విధంబులౌ శాస్త్రముల్ పఠన జేసి
నగణితంబగు శక్తితో నలరినాడు.

అంతరిక్షవిజ్ఞానంబు నందు మేటి 
సిరుల తల్లికి తండ్రియై శ్రీకరముగ
శ్రీహరిని నల్లునిగ దెచ్చి చిరయశమును
పొంది తరియించె నీ ఘన మునివరుండు.

చ్యవనుడు మరి శుక్రుడను సంతు తోడ
బలిమి కలిగి సజ్జనులకు బంధువాయె.
సాధికారత తో 'భృగుసంహిత' యను
శాస్త్రగ్రంథమున్ రచియించి జగతి కొసగె.

వరదులైన త్రిమూర్తుల పరమ శాంత
గుణములను పరిశోధింప కోరి వెడలి
చరిత కెక్కిన సిద్ధుడీ సాహసికుడు.
మునుల చరితలు పఠియింప ముక్తి కలుగు.

వారి తపముల ఫలితముల్ ప్రజల కొఱకు
ధారవోయుచు జీవించు దైవసములు.
వారి పదములన్ బూజింప భవ్యమైన
శాంతి తోడ సంసారముల్ సాగుచుండు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics