భగణ సీసము
భగణ సీసము
'భగణ 'సీసము.
పన్నగ భూషణ భైరవ నాథుడ
పాహి పరాత్పర!భవుడ!వినుము!
చెన్నుగ నీదరిఁ జేరితి శంకర!
చింతలు బాపుచు శివ మిడవయ!
తిన్నని గాచిన దేవర వీవని
తీరుగ మ్రొక్కితి దివిజ వినుత
సన్నుతి చేయుచు సన్నిధి సేవలు
సల్పెదనో హర!సమధికముగ/
తేటగీతి /
పరమ పావన మూర్తివి వరద వనుచు
తనివి తీరగ నామదిఁదలుచు కొనుచు
వినయ మొప్పగఁగొల్తును విషమనయన!
కరుణ చూపుము!నాయక!కఱిమెడదొర!//
