STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

భావమే గంధమై

భావమే గంధమై

1 min
0

మోహమే మధువుగా..దక్కెనే దక్కకే..! 

అశ్రువే తోడుగా..మిగిలెనే మిగలకే..! 


ప్రేమలో ఓటమే..లేదుగా నిజముగా.. 

వేధనే వనముగా..పెరిగెనే పెరగకే..! 


మాటతో యాతనే..తొలగెనే చూడగా.. 

మౌనమే విందుగా..అందెనే అందకే..!


భావమే గంధమై..భవముతో బంధమే.. 

కవనమే సుఖముగా..తలచెనే తలచకే..! 


ప్రాణమే తియ్యగా..గేయమై పోవునా.. 

గాయమే పువ్వుగా..నవ్వెనే నవ్వకే..! 


స్వర్గమో నరకమో..లేవులే చూడగా.. 

సత్యమే పాన్పుగా..చేరెనే చేరకే..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance