భావిభారతపౌరుడా!వినుము!
భావిభారతపౌరుడా!వినుము!
------------------------------
వీరపుత్రులఁ గన్న భూమిది భీరువై దిగులొందకోయ్!
భారమంతయు మోయువాడవు బాధనొందకు సోదరా!
కారు చీకటి బాటయందున కాంతివై వెలుగొందుమా!
భారతావని పేరు నిల్పగ బావుటా యెగయించుమా!
పేదవారికి తోడునీడగ పెద్దవై చరియించుమా!
వేదనొందెడి వారిచెంతకు వెళ్లి బాధలు తీర్చుమా!
'నీది నాద'ను తృష్ణ వీడుచు నీతి తప్పక మెల్గుచున్
సజ్జనాళికి మేలు చేయుచు శాంతికై కృషి సల్పుమా!
మత్తుమందుకు బానిసత్వము మంచి మార్గము చూపదోయ్!
చిత్తుగా నిను ముంచి వేయును చింతలో పడి పోకుమా!
చెత్త కార్యము లేవి సల్పకు జీవనంబున మంచికై
సత్తువంతయు చూపి నిల్చుచు సాహసంబులు చేయవోయ్!
నీ వికాసమె నీకు రక్షగ, నీవె మార్గము చూపవోయ్!
భావిభారత పౌరుడా!విను!భవ్యమౌ భవితంబుకై
గావుకేకలు పెట్టు వారిని గట్టిగానదిలించుచున్
చేవతో యువసింహమై చెల్గి దూకుమ శూరతన్!//
---------------------------
