STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బాటసారి

బాటసారి

1 min
311

నడచిన దూరమెంతో అనుభవసారమెంతో

ఇంకా నడవాల్సిన దూరమెంతో ఆశావహమెంతో

నడచిన కాలంలో ప్రయాసపడలేదు ప్రమోదమే

అస్థిరత లేదు ఆయాసం అసలే లేదు ఆనందం తప్ప!


నడకలో నడతలో దశాబ్దాలు గడిచె ఆదర్శ మార్గంలో

విసుగు లేదు విరామంలేదు నిరంత సంచారమే

చట్రం తిరుగుతున్నది బ్రతుకు చక్రం భ్రమిస్తున్నది

అలసట లేని ఆనంద విహారమే ఈ నడక!


కాలం గడచిపోయె కల్పనలు కరిగిపోయె

జీవిత అర్థం పరమార్థం మారిపోయె 

జీవితసారం తెలిసె క్షణభంగురమని

ఎవరికి ఎవరు ఏమీకారన్నది జీవితసత్యం!


నడిచే జీవిత యాత్రలో మనందరం తోటి ప్రయాణీకులం

ఎవరు ఎక్కడ ఎక్కాలో దిగవలెనో దిక్సూచి అతడే

ప్రయాణపు పదనిసల్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏల

ప్రతి అడుగు వైవిధ్యభరితం రసభరితం సుమపరిమళం!


                       


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational