బాల కార్మికులు
బాల కార్మికులు


ఆరిపోయే దీపమా
పేదరికమే పాపమా
విధికి వీరిపై కోపమా
బాల్యమే ఒక శాపమా !!
ఆదుకునే వయసులో అడుక్కునే దుస్థితా
చదువుకునే పిల్లలకు చాయందించే పరిస్థితా
పసివారే పని మనుషులా
చేయించేది పెద్దమనుషులా ?
ఎంత మంది పిల్లలో
ఎన్ని జీవితాలు గుల్ల లో
వాడుతున్న మల్లెలో
ప్రతి పల్లె పల్లెలో !!
సాయమందించే వారు కరువా
తలచుకుంటే గుండె చెరువ
బాలకార్మికుల జీవనం బారువా
తీసుకోరా ఎవరు చొరవ ?