STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బాధను పంచుకున్న కాగితం

బాధను పంచుకున్న కాగితం

1 min
301


బాధను పంచుకుంది కాగితం తనతో

బలాన్ని చేకూర్చింది అక్షరమై తనకు

రాయడానికి ముందు కొచ్చింది కలం నిర్మలంగా

ఆలోచనలకు భావం తోడుగా నిలిచినందుకు..


తెల్లటి కాగితం పై అక్షరాలు కదులుతుంటే

మబ్బుల్లో అలుముకున్న చీకటి రాత్రి వేదనా

కన్నీటి ధారలో సిరా లో నింపితే

హృదయములో ఎర్రటి చుక్కలు రాలుతున్నాయి..


కాగితం ముడతలు పడుతుంటే మనసు నలిగిపోయే

యదలో తడి ఆరిపోయింది ఆలోచన లేక

కలంలో సిరా చుక్క లక్షల ప్రశ్నలు వేస్తుంది

సమాధానము లేక సమస్య అలాగే మిగిలిపోయింది..


కాగితం నిండా నల్లటి మచ్చల జ్ఞాపకాలే మిగిలే

కన్నీళ్లు బిగపట్టి చూస్తున్నాయి అక్షరాలు ఇంకా

కాలం గడిచిపోయే కాగితం పాతబడిపోతుంది

గాయం మాత్రం ఇంకా కొత్తగానే అనిపిస్తుంది కాగితంపై..


కాగితం గాలికి ఎగురుతుంది అపుడపుడు తేలికై

అలంకరించుకున్న భావ కవితా సౌందర్యంతో మురిసి

రాసిందంతా వర్ణనకు రూపమై నిలిచినందుకు

కాగితం అక్షర చుక్కలతో మెరుస్తూ కనిపించినందుకు..


ఆకాశం నీలి కాగితము లా నిర్మలంగా కనిపిస్తుంటే

ఆలోచనా తరంగాలు విశాలమై పరుచుకొనే

నేలపై వెలసిన కవిత వృక్షం నింగిలో రంగవల్లి వేసే

ఆకాశపు చెట్టుకు అక్షర కుసుమాలు విరగబూసె




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational