STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

అవసరం

అవసరం

1 min
1


మాటల పాలను సరిగా..కాచుకొనుట అవసరం..!

పంచదగిన వెన్నలాగ..మనసుండుట అవసరం..!


నిదానమే ప్రధానమను..పాఠమెంత అద్భుతం..

అనుభవాల సారమేదొ..నిలుపుకొనుట అవసరం..! 


పరిమళించు మల్లికలా..ఉన్న హృదయ మెవరిదో.. 

పూలనదీ వాహినిలా..నవ్వుండుట అవసరం..! 


కత్తులైన బాంబులైన..అవినీతిని మాన్పునా.. 

దైవత్వపు చిరునామా..మతికెక్కుట అవసరం..! 


సమరోత్సాహం ఉంటే..సమ ఉజ్జీ చూసుకో.. 

యుద్ధమేదొ నీతో నువు..చేస్తుండుట అవసరం..! 


నీ అడుగుల ముద్రలేవి..మిగలనీకు ఎక్కడా.. 

ఎవరిదారి వారు సరిగ..చేసుకొనుట అవసరం..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics