అట్నుండి ఇటు....శ్రీనివాస భారత
అట్నుండి ఇటు....శ్రీనివాస భారత


అమ్మ వస్తున్నారా?
చెప్పడం మర్చాను
రెండు రోజుల్నుండి ఒకటే ఆయాసం
దానికి తోడు
జలుబు ,దగ్గు
డాక్టర్ కు చూపించమన్నా
విన్పించుకుంటేగా మీరు
రెండు వారాలైంది...
వాళ్లకి సేవలు చెయ్యలేను
నాకు బాగున్నప్పుడే కబురుపెడ్తా
అంతవరకూ ఆగమనండి
అంది శ్రీమతి...
సరే అన్నాడా అభాగ్యుడు..
వాళ్ళ ప్రయాణం వాయిదా పడింది
రాత్రి ఫోన్...
వాళ్ళమ్మనుంచి
వస్తామంటే ...రావొద్దన్నవేమని?
నేనెప్పుడన్నా
ఇట్నుండి ప్రశ్న
అల్లుడి ఫోన్...ఆరోగ్యం బాగాలేదని
నిద్రపోయేవేళ
రేపు మా అమ్మా నాన్న వస్తారట... రమ్మన్నాఅని
బాగులేక పోయినా తప్పదుగా..మరి
అభాగ్యుడు నవ్వుకున్నాడు....
రెండు తలల్లో...ఎన్ని ఆలోచనలో! అని
::::::::::%%%%%%%%%%%%%::::::::::