అశ్వగతివృత్త గర్భిత అశ్వగతిః
అశ్వగతివృత్త గర్భిత అశ్వగతిః
అశ్వగతివృత్త గర్భిత అశ్వగతిః తీవ్ర(అశ్వగతి) అశ్వగతిః
అశ్వగతి తీవ్ర(అశ్వగతి) అశ్వగతిః---భభభభభస--13 యతి
అశ్వగతివృత్తము--భభభభభగ --10యతి
మోహన రూపుఁడ! ముగ్ధల మూరితి! ముఖ్యము గొలిచీ
స్నేహము నందున నుండెడి చిత్తము స్నిగ్ధత గలనీ
దేహము గాచిన చాలునదేహరి! తీయని దగునీ
సోహములోనను గల్పుము సొక్కుదు సూక్ష్మము నఱయన్!!
అశ్వగతి వృత్తము __ భ భ భ భ భ గ /10 యతి.
మోహన రూపుఁడ ముగ్ధల మూరితి ముఖ్యముగా
స్నేహము నందున నుండెడి చిత్తము స్నిగ్ధతఁ నీ
దేహము గాచిన చాలునదేహరి! తీయని నీ
సోహములోనను గల్పుము సొక్కుదు సూక్ష్మముగన్!!
✍️చావలి బాలకృష్ణవేణి
౨౮::౧౨ ::౨౨
