అప్పుడు తెలిసింది
అప్పుడు తెలిసింది
చెట్టు నుండి ఒక వచ్చి నా ముందు వాలింది
చెట్టుపైకి చూశాను, మరొక ఆకు విలపించింది
ఆ కన్నీరు నా కంటిపాపపై పడింది.
అప్పుడు తెలిసింది విడిచి
ఉండలేని బాధ ఏమిటో..!!
తొలకరి చిలకరించింది
పుడమి పులకరించింది
గడ్డిపరక మొలకెత్తింది.
ప్రక్కన ఉన్న మరో మొక్క విరగబూసింది.
అప్పుడు తెలిసింది తోడులో
ఉన్న ఆనందం ఏమిటో..!!
అమావాస్య వస్తోంది
చుక్కలు ఒకొక్కటిగా
జతకడుతున్నాయి.
నల్లని రాతిరిని జిలుగు
వెలుగులతో నిండింది.
అప్పుడు తెలిసింది నిరాశలో
ఆశల వెలుతురు నిండుతాయని..!!
✍️ Radha
