STORYMIRROR

T. s.

Classics

4  

T. s.

Classics

అనుభూతుల సంద్రాలు

అనుభూతుల సంద్రాలు

1 min
280

నేలని తాకే సూర్య కిరణాలు నన్ను వెచ్చగా తడిమి

నాలోని భావాలను జాగృతం చేస్తున్నాయి..

రాత్రి పడిన మంచుకి నేలే తడిసింది అనుకున్న కానీ మనసు నిండుగా తడిసి ముద్దయింది..

మనసు తనలో ఉబికిన అనుభూతుల సంద్రాన్ని బయటికి తోయటానికి విశ్వప్రయత్నం చేస్తుంది..

అనుభూతుల అలలు నింగినందుకోవాల వద్దా అని ఆలోచిస్తూ ఎగిరి ఎగిరి పడుతున్నాయి..

తొలకరి తొలి చినుకు నన్ను తడిపి 

బీడు వారిన భూమి మీద జారినపుడు పుడమి ఎలా పులకరిస్తుందో! అలా నా మనసును పలకరించింది..

కొత్తగా నా మనసులో మొలకలేసిన ఆశల చిగురులు..

నాలో వికసింప చేసే భావ బంధాలు పల్లవ పారిజాతాల పరిమళాలు..



Rate this content
Log in

Similar telugu poem from Classics