STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

అంకితం

అంకితం

1 min
335

నిద్రలేని రాత్రులన్నీ నీకే అంకితం అందుకో

హద్దులేని ఆశలు అలలా కదిలాయెందుకో

మనసులోనే మారాం చేసినే ఇక కలుసుకో

సొగసులోనే సోయుగం ఉందని తెలుసుకో

నిద్రలేని రాత్రులన్నీ నీకే అంకితం అందుకో

హద్దులేని ఆశలు అలలా కదిలాయెందుకో


నిన్న రాత్రి నీవు కలలోకి రాకుంటే కలవరం

మొన్న మైత్రి మరిచావా అని ఇక జలధరం

నిన్న రాత్రి నీవు కలలోకి రాకుంటే కలవరం

మొన్న మైత్రి మరిచావా అని ఇక జలధరం

కమ్మని కలని కలిపేసి కానుకే ప్రసాదించవా

రెమ్మని కొమ్మనల విడిపోవుట నిషేధించవా

పూవులో తేనెలా తెలియకుండా కలిసిపోవ

రేవులో అలలా మనసు పొరలపై తేలిపోవ


నిద్రలేని రాత్రులన్నీ నీకే అంకితం అందుకో

హద్దులేని ఆశలు అలలా కదిలాయెందుకో

నిద్రలేని రాత్రులన్నీ నీకే అంకితం అందుకో

హద్దులేని ఆశలు అలలా కదిలాయెందుకో


కొత్తగా కోరికలూ పెనవేసే ప్రేమలన్నీ కలిపి

మత్తుగా మది గదిని ముంచెత్తెనూ నిలిపి

ఒక వింతలోకం ఎదుట నిలిచే వింతగాను

ఇక చెంతచేరి చెకుముకి రగిలెనే ఆశగాను


నిద్రలేని రాత్రులన్నీ నీకే అంకితం అందుకో

హద్దులేని ఆశలు అలలా కదిలాయెందుకో

మనసులోనే మారాం చేసినే ఇక కలుసుకో

సొగసులోనే సోయుగం ఉందని తెలుసుకో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance