Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Inspirational

4.8  

Ramesh Babu Kommineni

Inspirational

అంజలి

అంజలి

1 min
423


ప౹౹

తెలియని దారిలో తెగువతోనే పయనించాలి

కలియని మనుసులలోనే ఆకాంక్షనే పెంచాలి ౹2౹


చ||

వెన్నెల వెలుగూ ఎదురై పిలిచి ఎదనే కలుపు

ఉన్న ఆశలూ ఊహలే పెంచి తలచే ఆవలపు |2|

కోరికేకొత్తగామొలిచి మదిని ముంచేమత్తులో

తామసమేలా తనుసిద్దమే వలపునే హత్తుకో |ప|


చ||

కలవరింతలేల మనసులో ఎందుకు కలతలు

పలవరింతలతో నిలువరించగలేని అలతలు |2|

ఎక్కడో కురిసిన మేఘము ఇక్కడే చిగుర్చగా

ఎన్నాళ్ళీ ఎదురు చూపులు ఎడదనే చేర్చగా |ప|


చ||

చూపుల్లో కురిసే ఎలమికి అర్పించు అంజలి

మాపుల్లో విరిసే విరహానికి చూపించు జాలి |2|

కనిపించని స్వర్గమే కబురే చేసే ప్రణయానికి

కాసింత తీరిక చేసి ఒప్పించు పరిణయానికి

|ప|



Rate this content
Log in