అందమే
అందమే
వ్యంగ్యవైభవం చక్కగ..పండించుట అందమే..!
ఎవరి మనసు నొప్పించక..మసలుకొనుట అందమే..!
గులాబీల చాటు ముళ్లు..ఏ పూవును గుచ్చేను..
మౌనములో మునిగి సరిగ..పదునెక్కుట అందమే..!
పాఠమేల మధురమౌను..సహనమింత చూపకే..
చెట్టుమీది పండులాగ..మధువూరుట అందమే..!
చమత్కార ప్రతీకలే..తీర్చేవా జగడాలను..
గుండెనిండ మనసారా..నవ్వుకొనుట అందమే..!
ఎంత కాదు అనుకున్నా..చేదు ఎంత మధురమో..
రెండు లేనె లేవన్నది..తెలుసుకొనుట అందమే..!

