అందమైన మనసు
అందమైన మనసు


ప౹౹ అందమైన మనసొకటి ఉంటేనే చాలదులే అందుకునే చేయొకటైనా మనకి కావాలిలే ౹2౹
చ౹౹ ఎడారి ప్రేమలో ఎదలు రెండు దరిచేరునా బిడారు తప్పిన వలపు బీదకే ఆశతీరునా ౹2౹
నెలవు దొరకని ప్రేమలు నెగ్గలేక నెమరేనా సెలవు చెప్పి చెరో దారి పోవుట అమరేనా ౹ప౹
చ౹౹ ధైర్యముంటే ధనసొదిలినా బాణమవ్వాలి స్థైర్యముంచి ప్రేమించినోరికి ప్రాణమివ్వాలి ౹2౹
తడబడక తన్మయమే ఆస్వాదన చేయాలి ఒడంబడిక చేసి ప్రణయ పత్రమే రాయాలి ౹ప౹
చ౹౹ ఎండమావులూ తృష్ణ ఎప్పటికి తీర్చవులే ఎడంకాని మనసులే ఎడదలనే జార్చవులే ౹2౹
కోరికే కొసిరాక కొండైనా కదలి రావలిసిందే తీరికచేసి తీపినే జంటైనా పంచ వలసిందే ౹ప౹