STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

అందాలు చిందేసి..

అందాలు చిందేసి..

1 min
349

అందాలు చిందేసి అద్భుతాలు ఆవిష్కరించే

అరవిందాలు మొగ్గేసి విరబూచి అనుసరించే

కదిలించే హాయీ మరల కలిగించు ఈ రేయీ

ఉదయించే ఉత్సాహం ఉరికించనీయ ఓయీ

అందాలు చిందేసి అద్భుతాలు ఆవిష్కరించే

అరవిందాలు మొగ్గేసి విరబూచి అనుసరించే


ఎంత మోహమో ఎదలోన వెలిగించిపోయెనే

అంత విరహమే అదుపుకై అదిలించిపోయెనే

చూపులోని చుక్కాని తీరాలకు దరి చేరమని

దాపులేని అధరాలకూ దగ్గరాయేను చేరిమరి

ఒడలిక లేని సౌఖ్యమే లేమతో కోరి చేరుకొని

బడలిక లేని సఖ్యమే భామతో మరీ కోరుకొని

అందాలు చిందేసి అద్భుతాలు ఆవిష్కరించే

అరవిందాలు మొగ్గేసి విరబూచి అనుసరించే


తొలివేకువ తోరణములై తొలకరి పులకింతలై

గిలి పెంచే చలి రణములై ఆ మదిలో చింతలై

ఆకాశమే హద్దుగా హరివిల్లూ సప్త వర్ణాలుగా

అవకాశమే పొద్దుగా దారిచూపెనే కిరణాలుగా

అందాలు చిందేసి అద్భుతాలు ఆవిష్కరించే

అరవిందాలు మొగ్గేసి విరబూచి అనుసరించే

కదిలించే హాయీ మరల కలిగించు ఈ రేయీ

ఉదయించే ఉత్సాహం ఉరికించనీయ ఓయీ



కొత్త కోయిలల కూజితాలే కుశలం కూడ పలికే 

మత్త కోకిలలా హత్తుకొని మదిలో మధువొలికే

కొత్త కోయిలల కూజితాలే కుశలం కూడ పలికే 

మత్త కోకిలలా హత్తుకొని మదిలో మధువొలికే

అందాలు చిందేసి అద్భుతాలు ఆవిష్కరించే

అరవిందాలు మొగ్గేసి విరబూచి అనుసరించే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance