STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

అమృత భాష

అమృత భాష

1 min
254


అక్షరంబులే మనకీయ నమృత వాక్కు

పలుకు చుందుము కడదాక బ్రతుకు లోన

మాట లేనిది భువియందు మనికి లేదు

భావముల్ తెల్పు మాటయే భాష యగును.

అమ్మ నేర్పెడి భాషయే ఆది భాష

మాతృభాషయే గొప్పది మహిని వెదుక

మధుర మధురమైనది తెల్గు సుధలు చిల్కు

తెలుగు భాషయే ధరలోన వెలుగు భాష.

దొరల చదువులే ప్రతి యింట దొరలు చున్న

మాతృ భాషను పిల్లలు మఱచి పోవ

దుర్గతులు పట్టు మన లోని దోషములను

దిద్దు కోవలె నాంధ్రులు తెలివి చూపి.

కలిమి వంటిది మన భాష కనులు తెరచి

చూడకున్నమన ఘనత సొమ్మసిల్లు 

వారసత్వసంపద వంటి భాష మనల

వదలి పోవగ మనలేము భాష లేక.

గిడుగు చూపిన బాటలో వెడలి తుదకు

పూర్వ వైభవమును తెచ్చి ముందు ముందు

తెలుగు నభివృద్ధి చేయగ తెలుగు వారు

మాతృభాషయే నిల్చును మానితముగ.

--------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics