అమరజీవి గాంధీ
అమరజీవి గాంధీ
*అమరజీవి గాంధీ*(కవిత )
ఆశయాలతో జీవించి ఆచంద్రార్కం నిలిచి నాడు
దేశ ప్రజలను కూడగట్టి దేవుడై చరించినాడు
సద్గుణవంతుడీ జాతినేకత్రాటిపై నడిపినాడు
సత్యాగ్రహమే యూపిరిగా సమరంలో దూకినాడు
ఉప్పు సత్యాగ్రహం సల్పి నిప్పువలె చెలరేగినాడు
ఒప్పిదముగా నుద్యమంబు నడిపిన నేకవీరుడు
అహింసామార్గం చూపి నవనికే ఆదర్శమయినాడు
సహనమే మేలని చాటిన సత్యసంధుడు
కొల్లాయిగట్టిన వాడే గురువుగా నిలిచినాడు
తెల్లదొరల సంకెళ్ళు ద్రెంచి స్వేచ్ఛనే తెచ్చినాడ
స్వచ్ఛతయే ప్రజకు శ్రేయమొసగునని చాటినాడు
తుచ్ఛులైన వారి దోషములు క్షమించి నాడు
వంచనల్ నిలబడవంచు ధాటిగా తెల్పినాడు
మంచినే పెంచుకోమని భారతంబును కోరినాడు
గాడ్సే తూటాకు బలి అయిన అమరజీవి గాంధీ.
---------------------------------------------------
