అమ్మా♥️♥️
అమ్మా♥️♥️
కల కనని మా జన్మకు కారణం ఎవ్వరమ్మా....
మా కనుచూపుకు వెలుగు ఇచ్చిన దీపం ఎవ్వరమ్మా....
మా తొలి ఊపిరికి ఉయ్యాల ఎవ్వరమ్మా...
మా తొలి మాటకు మధురం ఎవ్వరమ్మా...
మా మొదటి అడుగుకు మార్గం ఎవ్వరమ్మా...
మా రూపం చెక్కిన శిలి ఎవ్వరమ్మా...
ప్రాణం అంటే భయం లేదు, ఎందుకంటే నేను
ఒక కొత్త ప్రాణానికి ఆయువు పోస్తున్నాని....
అమ్మా... ఎవ్వరికి ఉంటుంది అమ్మా నీ అంత ధైర్యం,
ప్రాణం పోతుంది అని తెలిసినా ఫర్వాలేదు అంటావ్...
ఎవ్వరికి ఉంటుంది అమ్మా తాగ్యం, రక్తాన్ని శక్తిగా చేసి
ఉగ్గు పాలుగా ఊపిరి పోస్తావ్...
అమ్మా ఎంత చెప్పినా తక్కువే నీ గురుంచి వందనం అమ్మ...
