అమ్మా ♥️♥️♥️
అమ్మా ♥️♥️♥️
కన్నతల్లి తనప్రాణం..పెడుతూనే ఉన్నది..!
సరికొత్తగ అనుక్షణం..కంటూనే ఉన్నది..!
ప్రేమ గొప్పతనం చూడు..అమ్మపేగు రాగం..
అశ్రునిధికి ఒకసాక్షిగ..ఉంటూనే ఉన్నది..!
నరకమునే స్వర్గముగా..భావించును నిత్యము..
తనబాధను మౌనంలో..దాస్తూనే ఉన్నది..!
చెప్పుకోను తోడెవ్వరు..వెర్రిమనసు అదిగో..
అమ్మ గోడకుర్చీతో..చెబుతూనే ఉన్నది..!
తనకొంగును పానుపుగా..తలచేనో లేదో..
నడుంవాల్చి వాల్చకనే..లేస్తూనే ఉన్నది..!
బిడ్డలెవరొ కొడుకులెవరొ..వంటగదే నేస్తం..
మధురమైన యాతనేదొ..మోస్తూనే ఉన్నది..!
