అమెరికా
అమెరికా


అదిగదిగో అమెరికా
అరమరికలు అమరిక
వెళ్లే ముందు కోరిక
వెళ్ళాకుండదు తీరిక !!
పాచికంపుల పలకరింపులు
నిద్ర మొహాలు బద్ధకం ప్రాణులు
అరకొర స్నానాలు అరచేతిలో ప్రాణాలు
టిష్యూ పేపర్లు బ్రెడ్డు బర్గెర్లు !!
అన్ని పనులు మనమే చేసే చావు
అంట్లు తోమారా అప్పారావు
దుమ్ము దూలపరా సుబ్బారావు
బట్టలుతకరా బాబురావు
దొడ్లు కడగరా దున్నారావు !!
జీవం లేని జీవితం
జీవితమంటేనే జీతం
మనిషి బుధ్ధికి వాతం
మనుగడే ఇక అశనిపాతం !!
అయినా వారికి దూరంగా
కానీ వారికి దెగ్గరగా
సంపాదనకై ఆరాటం
పగలు రాత్రి పోరాటం !!
మెకానిక్ లైఫ్ లో మెషిన్ లా తిరుగుతూ
పగలు పాడుకుంటూ రాత్రి మేల్కొంటు
పరధ్యానంగా ఉంటూ గడ్డి గాఢం తింటూ
అడ్డమైనవి కొంటూ అందరి ముందు ష్టoటు !!
పరాయి దేశంపై మోజు
మన దేశం పై ఫోజు
వెస్ట్రన్ కల్చర్ క్రేజు
బుర్రకి పట్టిందిరా బూజు !!